August 4, 2026
Explore
టీచర్లకు టెట్ తప్పనిసరి.. కేంద్రం స్పష్టం

టీచర్లకు టెట్ తప్పనిసరి.. కేంద్రం స్పష్టం

August 4, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌)లో ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు ఉత్తీర్ణత సాధించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. పార్లమెంట్‌లో ఈ అంశంపై వివరణ ఇచ్చిన కేంద్రం, టెట్‌ అర్హత పొందేందుకు 2028 ఆగస్టు వరకు గడువు ఇచ్చినట్లు తెలిపింది. 2025లో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తొలుత 2027 ఆగస్టు వరకు గడువు నిర్ణయించగా, రివ్యూ పిటిషన్ల పరిశీలన తర్వాత దానిని పొడిగించినట్లు వెల్లడించింది. ఉపాధ్యాయులకు అవకాశాలు పెంచేందుకు కొన్ని రాష్ట్రాలు ఏడాదికి రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తున్నాయని పేర్కొంది. గడువులోగా అర్హత సాధించని టీచర్లు తప్పనిసరిగా పరీక్ష రాయాల్సి ఉంటుంద‌ని తెలిపింది.

Tags: TET mandatory for teachers: Centre clarifies.