August 4, 2026
Explore
పెట్రోల్, డీజిల్ పై కేంద్రం విండ్ ఫాల్ ట్యాక్స్ పెంపు

పెట్రోల్, డీజిల్ పై కేంద్రం విండ్ ఫాల్ ట్యాక్స్ పెంపు

August 4, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్స్ను మరోసారి పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్ట్ 3వ తేదీ నుంచి ఈ కొత్త పన్నులు అమల్లోకి రానున్నాయి. లీటర్ డీజిల్పై రూ.15.50 నుంచి రూ.24కు, పెట్రోల్ రూ.2.50 నుంచి రూ.3.50కు, రిఫైనరీల అదనపు లాభాలపై లీటరుకు రూ.24 ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం విధించనున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు ధరల ఆధారంగా ప్రభుత్వం ప్రతీ 15 రోజులకు ఒకసారి ఈ పన్నులను సమీక్షిస్తూ సవరిస్తుంది. ఈ పెంపు దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపదు.

Tags: Centre hikes windfall tax on petrol and diesel.