పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని నగరివీధిలో గల శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఆడికృత్తిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంగళవారం అర్చకులు తెలిపారు. ఉత్సవాలలో 5న భరణికావిడిలు, 6న ఆడికృత్తిక సందర్భంగా పూలంగిసేవ నిర్వహిస్తామన్నారు. 8న స్వామివారి కళ్యాణోత్సవము, రాత్రి శ్రీవారి ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.
Tags: Krittika festival celebrations from the 5th