August 4, 2026
Explore
కంకర తేలిన రోడ్డుతో ఇబ్బందులు

కంకర తేలిన రోడ్డుతో ఇబ్బందులు

August 4, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని పలు గ్రామాలకు సరైన రోడ్లుసౌకర్యం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కంకర తేలిన రోడ్డుపై ప్రజలు అతికష్టం మీద ప్రయాణాలు సాగిస్తున్నా….ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మండలంలోని కుమ్మరగుంట , మేకంజామనపల్లె గ్రామాల మధ్యన కంకర తేలిన రోడ్డుపై ప్రయాణం నరకయాతనంగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కుమ్మరగుంట నుంచి వనమలదిన్నె, మేకంజామనపల్లె , మేలుందొడ్డి మీదుగా మండల కేంద్రమైన పుంగనూరుకు ప్రజలు వివిధ పనులు నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. కానీ 12 కీలోమీటర్ల దూరం ఉన్న రోడ్డు వెహోత్తం కంకర తేలడంతో పలుమార్లు ద్విచక్రవాహనదారులు కిందపడి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికైన అధికారులు స్పందించి రోడ్డుకు తారువేయాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Tags: Difficulties caused by a road with exposed gravel