పుంగనూరుముచ్చట్లు:
బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరమని ఐసిడిఎస్ అధికారులు తెలిపారు. మంగళవారం తల్లిపాలు వారోత్సవాలు పురస్కరించుకుని మోదుగులపల్లె సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో రాజేశ్వరి మాట్లాడుతూ తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లిబిడ్డకు అనుబంధంతో పాటు ఆరోగ్యవంతమైన శిశువుగా ఎదుగుతుందని తెలిపారు. పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు అందించాలని సూచించారు. సూపర్‌వైజర్ సుగుణ మాట్లాడుతూ బాల్యవివాహాలు చేసుకోవడం , వీటిని ప్రోత్సహించడం చట్టరీత్య నేరమని తెలిపారు. ఎక్కడైన బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. ఈకార్యక్రమంలో మహిళా పోలీస్ సమీనా, సచివాలయ సిబ్బంది, అంగన్‌వాడి సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Breast milk is beneficial for the baby.