August 4, 2026
Explore
ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుడికి ఆక్సిజన్‌ కాన్సట్రేటర్‌ విరాళం

ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుడికి ఆక్సిజన్‌ కాన్సట్రేటర్‌ విరాళం

August 4, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని లయన్స్ క్లబ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ శివ ఆధ్వర్యంలో ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుడికి ఆక్సిజన్‌ కాన్సట్రేటర్‌ విరాళంగా ఇచ్చారు. మంగళవారం డాక్టర్‌ శివ మాట్లాడుతూ లయన్స్ క్లబ్‌ పిఎంసీసీ భానుమూర్తిరెడ్డి తన నిధులతో బాధితుడు నాగయ్యకు సుమారు లక్షరూపాయలు విలువ చేసే యంత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. బాధితుడు లయన్స్ క్లబ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిదులు మహేంద్రరావు, మహిపాల్‌రెడ్డి, సుధాకర్‌రావు, వరదారెడ్డి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags: Oxygen concentrator donated to a patient with lung disease.