August 4, 2026
Explore
వ్యవసాయ పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

వ్యవసాయ పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

August 4, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

కిలికిరికి చెందిన కృషివిజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్‌ మంజుల, ఎం.రెడ్డికుమార్‌, ఠాగూర్‌, కెవికె లు మండలంలోని వివిధ గ్రామాల్లో పంటలను పరిశీలించారు. మంగళవారం శాస్త్రవేత్తలు ఏడి శివకుమార్‌, ఏవో రాధ కలసి సుగాలిమిట్ట, బోడినాయునిపల్లె, భీమగానిపల్లె ప్రాంతాలలో వేరుశెనగ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వేరుశెనగ పంట పూర్తిగా దెబ్బతిందన్నారు. కంది, అలసంద, అనుములు, ఉలవ, పెసర, మినుములు, సజ్జ, జొన్న పంటలను ప్రస్తుతం సాగు చేసుకునే వారు వ్యవసాయ బోర్ల ఆధారంతో పండించుకోవాలన్నారు. రైతులు నీరాధార పంటలను పండించడం తగ్గించాలని సూచించారు. ఈ మేరకు రైతులకు పలు రకాల సూచనలు చేశారు.

Tags: Scientists inspected the agricultural crops.