మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె పట్టణంలోని నిమ్మనపల్లె రోడ్డులో ఉన్న నౌషాద్ కార్ మెకానిక్ షెడ్‌లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక కేంద్రాధికారి జి. శివప్ప ఆధ్వర్యంలోని సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో కార్ ఇంజన్లు, స్పేర్ పార్ట్స్, ఒక కారు పాక్షికంగా దగ్ధమవడంతో పాటు ఇతర సామగ్రి కాలిపోయింది. ఈ ఘటనలో సుమారు రూ.7 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని షేక్ నౌషాద్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Tags: Fire accident in Madanapalle; property worth ₹7 lakh destroyed.