August 4, 2026
Explore
రాయచోటిలో 1.1 కిలోల గంజాయి పట్టివేత.. బీహార్ వ్యక్తి అరెస్ట్

రాయచోటిలో 1.1 కిలోల గంజాయి పట్టివేత.. బీహార్ వ్యక్తి అరెస్ట్

August 4, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి అర్బన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మదనపల్లె రింగ్‌రోడ్ వద్ద అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన హర్మోద్ కుమార్ (32)ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ దీరజ్, డీఎస్పీ కృష్ణమోహన్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ ఎం. విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద నుంచి 1.1 కిలోల (1100 గ్రాములు) గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకటాచలపతి తెలిపారు. జీవనోపాధి కోసం రాయచోటికి వచ్చి కూలి పనులు చేస్తూనే గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించినట్లు వెల్లడించారు. అతనిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద క్రైమ్ నెం.407/2026 నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల విక్రయాలు, రవాణాపై సమాచారం ఉంటే సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు పేర్కొన్నారు.

Tags: 1.1 kg of ganja seized in Rayachoti; Bihar man arrested.