మదనపల్లి ముచ్చట్లు:
మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం ‘దివిసీమ గాంధీ’గా పేరుగాంచిన శ్రీ మండలి వెంకట కృష్ణారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ సామాన్యుడిలా జీవిస్తూ, 1977 దివిసీమ తుఫాను సమయంలో మండలి వెంకట కృష్ణారావు అందించిన నిస్వార్థ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నిజాయితీ, అంకితభావంతో ప్రజలకు విధులు నిర్వర్తించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
Tags: Police pay grand tribute to Venkata Krishna Rao.