తిరుపతి ముచ్చట్లు:
- దివంగత ప్రముఖ నాయకుడు మండలి వెంకట కృష్ణారావు కి ఘన నివాళులు.
- ఆయన ప్రజాసేవ, సామాజిక సేవలను స్మరించుకున్న జిల్లా పోలీస్ అధికారులు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో దివంగత ప్రముఖ నాయకుడు మండలి వెంకట కృష్ణారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మండలి వెంకట కృష్ణారావు ప్రజాహితం, సామాజిక సంక్షేమం కోసం విశేష కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ప్రజా సేవ పట్ల ఆయనకున్న అంకితభావం, విలువలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజాభివృద్ధి కోసం ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని మండలి వెంకట కృష్ణారావు సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.
Tags:Tributes to Mandali Venkata Krishna Rao.