August 4, 2026
Explore
గొడ్డలితో కన్నకొడుకును నరికి చంపిన తండ్రి!

గొడ్డలితో కన్నకొడుకును నరికి చంపిన తండ్రి!

August 4, 2026 | Andhra Pradesh

నంద్యాల ముచ్చట్లు:

నాన్న.. మద్యం ఎక్కువ తాగమాకు ఆరోగ్యం చెడిపోయిద్ది..మద్యం వద్దు నాన్న..అని మంచి చెప్పిన కొడుకును…నాకే నీతులు చెబుతావా అని పట్టరాని ఆవేశం తో… గొడ్డలితో కన్నకొడుకును నరికి చంపిన తండ్రి!

ఎటుపోతుంది ఈ సమాజం….మంచి చెప్పడం కూడా ప్రాణాలు మీదకు తెస్తోంది… దయచేసి ఎవరికి మంచి చెప్పకండి…. ఫ్రండ్స్…అంత అవసరం కూడా లేదు ఫ్రండ్స్!…ఎవడు ఎట్లా అయిన పోనివ్వండి


బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామంలో, మద్యం తాగొద్దని చెప్పిన కొడుకు (మధుకృష్ణను) తండ్రి బాలమద్దిలేటి గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు.

తరచూ మద్యం విషయంలో గొడవపడే తండ్రీకొడుకుల మధ్య జరిగిన ఈ ఘర్షణలో…,

కొడుకు మందలించడంతో కక్ష పెంచుకున్న తండ్రి సోమవారం అర్ధరాత్రి నిద్రలో ఉన్న కుమారుడిపై దాడి చేశాడు.అక్కడికక్కడే కొడుకు మరణించాడు.

అడ్డుకునేందుకు ప్రయత్నించిన తన భార్య పై కూడా దాడికి యత్నించి నిందితుడు పరారయ్యాడు.

పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

Tags: Father hacks his own son to death with an axe!