August 4, 2026
Explore
రాజధాని ‘అమరావతి’ పరుగులు.. నిర్మాణాల్లో ఉరుకులు..!

రాజధాని ‘అమరావతి’ పరుగులు.. నిర్మాణాల్లో ఉరుకులు..!

August 4, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అమరావతిలో నిర్మాణంలో ఉన్న మంత్రుల బంగ్లాలు, ఐకానిక్ టవర్స్, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ నివాసాలను పరిశీలించిన మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, సవిత.

ఆగస్టు 13న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లను పూర్తిచేసి GADకి అప్పగించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి.

అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మంత్రి నారాయణ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని మంత్రి అనగాని ప్రశంస.

చంద్రబాబుపై అక్కసుతోనే గత ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించిందని.. జగన్ విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని మంత్రి అనగాని విమర్శ.

16 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేసిన లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమని మంత్రి అనగాని వ్యాఖ్య.

రాజధానిపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని.. ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం చంద్రబాబు నిలబెడుతున్నారని స్పష్టం చేసిన మంత్రి సవిత.

Tags: Capital ‘Amaravati’ racing ahead… construction work in full swing!