August 4, 2026
Explore
గంజాయి నేరస్థులను వదిలే ప్రసక్తి లేదు: పరారీలో ఉన్న A-4 నిందితుడి అరెస్ట్

గంజాయి నేరస్థులను వదిలే ప్రసక్తి లేదు: పరారీలో ఉన్న A-4 నిందితుడి అరెస్ట్

August 4, 2026 | Andhra Pradesh

అనకాపల్లి ముచ్చట్లు:

అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కఠిన ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

ఇందులో భాగంగా కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రోలుగుంట పోలీసు బృందం సోదాలు నిర్వహించి, కొన్నాళ్లుగా పరారీలో ఉన్న ఒక కీలక నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

కేసు మరియు నిందితుడి వివరాలు:
కేసు వివరాలు: రోలుగుంట పోలీస్ స్టేషన్ Cr.No.133/2022, U/s 20(b)(ii)(C) r/w 8(c) NDPS Act.

అరెస్టయిన నిందితుడు (A-4): ఏలంశెట్టి అప్పారావు (43 సం||లు), తండ్రి: చక్రం, కులం: కాపు, వృత్తి: కూలీ.
​చిరునామా: స్వగ్రామం బీ.బీ.పట్నం, ప్రస్తుతం నివాసం రత్నంపేట గ్రామం, రోలుగుంట మండలం, అనకాపల్లి జిల్లా.

​సి.ఐ. హెచ్చరిక:
​ఈ సందర్భంగా కొత్తకోట సి.ఐ. జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ — “జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టమైన మార్గదర్శకాల ప్రకారం గంజాయి విక్రయదారులు, రవాణాదారులు మరియు ఈ నేరాల్లో భాగస్వాములైన ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదు. పాత కేసుల్లో పరారీలో ఉన్న నిందితులపై నిరంతరం నిఘా ఉంచి వారిని చట్టం ముందుకు తెస్తున్నాం. మత్తు పదార్థాల రవాణా లేదా వినియోగానికి పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.
​గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే 112/1972 కాల్ చేసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతామని ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Tags:No question of sparing cannabis offenders: Absconding A-4 accused arrested.