August 4, 2026
Explore
కిడ్నాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్.. గుజరాత్‌లో పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా

కిడ్నాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్.. గుజరాత్‌లో పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా

August 4, 2026 | Andhra Pradesh

గుజరాత్‌ ముచ్చట్లు:

గుజరాత్‌లో అదుపులోకి తీసుకున్న నూజివీడు పోలీసులు

కొద్ది రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ముస్తఫా

టెక్నికల్ నిఘా సాయంతో నిందితుడి ఆచూకీ గుర్తింపు

ఆయన కుమారుడిపై కూడా కిడ్నాప్ కేసు నమోదు

వైసీపీ నేత, గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫాను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కేసుకు సంబంధించి గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆయన్ను నూజివీడు పోలీసులు గుజరాత్‌లో అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక నిఘా సాయంతో ముస్తఫా ఆచూకీని గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

కేసు నేపథ్యం: ఇటీవల పొగాకు లోడ్‌తో వెళ్తున్న ఒక వాహనాన్ని ముస్తఫా కుమారుడు, అతని అనుచరులు అడ్డగించారు. ఆ వాహనంలో ఉన్న పొగాకు వ్యాపారితో పాటు మరో వ్యక్తిని కిడ్నాప్ చేసి బంధించారు. బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు రంగంలోకి దిగి కిడ్నాప్‌కు గురైన ఇద్దరినీ సురక్షితంగా విడిపించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా తొలుత ముస్తఫా కుమారుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అయితే, విచారణలో ఈ కిడ్నాప్‌తో మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు కూడా సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో ఆయనపై కిడ్నాప్, బెదిరింపుల కింద కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి ముస్తఫా అజ్ఞాతంలోకి వెళ్లగా, చివరకు సాంకేతిక ఆధారాలతో ఆయన గుజరాత్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్ట్ చేశారు. ముస్తఫా అరెస్ట్‌ను పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు.

Tags: YCP leader arrested in kidnapping case; former MLA Mustafa nabbed in Gujarat.