రాయచోటి ముచ్చట్లు:
నిందుతుడితో పాటు స్వాధీనం చేసుకున్న గంజాయిని మీడియా ఎదుట హాజరు పరిచి వివరాలు వెల్లడి
అన్నమయ్య జిల్లా రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదనపల్లె రింగ్ రోడ్ వద్ద అక్రమంగా గంజాయి అమ్ముతున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు.రాబడిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ దీరజ్ కునుబిల్లి. ఐపిఎస్,డిఎస్పీ కృష్ణ మోహన్ ఆదేశాలు మేరకు ఎస్ ఐ ఎం. విష్ణువర్ధన్ తమ సిబ్బందితో దాడులు నిర్వహించి హర్మోద్ కుమార్ (32) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని,అతని వద్ద నుంచి ఒక ప్లాస్టిక్ కవర్‌లో ఉన్న 1.1 కిలోల (1100 గ్రాములు) గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ వెంకటా చలపతి వెల్లడించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జీవనోపాధి కోసం రాయచోటికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ.. అక్రమంగా గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించారన్నారు.ఈ మేరకు అతనిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ (NDPS) కింద క్రైమ్ నెం. 407/2026 నమోదు చేసి కోర్టులో హాజరు పరిచమన్నారు.గంజాయి లేదా మాదక ద్రవ్యాల విక్రయాలు, రవాణా గురించి సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు కాల్ చేసి తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఐ జహీర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు..
Tags: Ganja seized in Rayachoti; Bihar native arrested…