August 3, 2026
Explore
విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

August 3, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్ర వ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర అసోషియేట్‌ అధ్యక్షుడు గురురాజారావు డిమాండ్‌ చేశారు. సోమవారం విశ్రాంత ఉద్యోగుల సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్‌రెడ్డి, స్థానిక అధ్యక్షుడు చెంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఐఆర్‌ ప్రకటించాలని, డిఆర్‌ బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 15 నుంచి ఉధ్యమాలు చేసేందుకు విశ్రాంత ఉద్యోగులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘ ప్రతినిదులు రామచంద్ర, కేశవరెడ్డి, సిద్దలింగం, ఈశ్వర్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags; The problems of retired employees must be resolved.