August 3, 2026
Explore
ఎంఆర్‌పిఎస్‌ నేతల నియామకం

ఎంఆర్‌పిఎస్‌ నేతల నియామకం

August 3, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

నియోజకవర్గంలోని ఎంఆర్‌పిఎస్‌ , ఎంఎస్‌పి అనుబంధ సంఘాలకు నూతన నేతలను నియమించారు. సోమవారం నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జ్ సంజీవ మాదిగ , మాధుమాదిగ, రవీంద్ర లు హాజరైయ్యారు. పార్టీ ఆదేశాల మేరకు గ్రామ , మండల కమిటిలను నియమిస్తున్నట్లు తెలిపారు. నవంబర్‌ 9న వరంగల్‌లో జరిగే ఎంఆర్‌పిఎస్‌ జాతీయ సదస్సును జయప్రదం చేసేందుకు కమిటిలను ఏర్పాటు చేశామన్నారు. మండల ఇన్‌చార్జ్గా మాతంగి నాగభూషణం, నరసింహులు, పరగాని ప్రభాకర్‌, గంగులప్ప, చౌడేపల్లె ఇన్‌చార్జ్గా పగడాల గోవిందు, మల్లికార్జున, వెంకట్రమణ, సుబ్రమణ్యం, నాగరాజు లను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సహాయకార్యదర్శి మాటూరు మురళి, సహాయ కార్యదర్శి మందరామనాథం, రవీంద్రమాదిగ, ప్రకాష్‌ మాదిగ, గంగప్ప, సుబ్రమణ్యం, బాబన్న, శ్రీనివాసులు, విజయ్‌, వెంకటస్వామి, సదాశివ, ఆనంద, శివశంకర్‌, శంకర, నల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags: Appointment of MRPS leaders