శ్రీకాళహస్తీ ముచ్చట్లు:
శ్రీ చంగల్రాయ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవ.శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ చంగల్రాయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుగుతున్నాయి.
బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శ్రీ చంగల్రాయ స్వామి అమ్మవార్లు సూర్యప్రభ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య సూర్యప్రభ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ పురవీధుల్లో ఊరేగించారు.
ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ చంగల్రాయ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం బోర్డు సభ్యులు గుర్రప్ప శెట్టి, లక్ష్మమ్మ, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం యాదవ్ , ఆలయ ఇన్స్పెక్టర్ ఎం హరి యాదవ్ దేవస్థానం అధికారులు, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.
Tags: Sri Changalraya Swamy Brahmotsavams Celebrated with Devotion and Fervor