August 3, 2026
Explore
జులైలో జీఎస్టీ వసూళ్లు 2లక్షల కోట్లు.

జులైలో జీఎస్టీ వసూళ్లు 2లక్షల కోట్లు.

August 3, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. జులైలో రూ.2.11 లక్షల కోట్ల జీఎస్టీవసూలైనట్లు ప్రకటించింది.ఇందులో సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) వసూళ్లు రూ.39,835 కోట్లు, స్టేట్ జీఎస్టీ (ఎసీఎస్టీ) వసూళ్లు రూ.47,881 కోట్లుకాగా ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) వసూళ్లు రూ.1.23 లక్షలుగా ఉన్నాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే గతేడాది ఇదే నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లలో 15.4 శాతం పెరుగుదల ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కావడం ఇది రెండోసారి. జీఎస్టీ వసూళ్లలో హరియాణా అత్యధిక వృద్ధి సాధించింది. గుజరాత్ రెండో స్థానంలో, తెలంగాణ కూడా భారీ వృద్ధి (19 శాతం) నమోదు చేసింది. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లపై ఆర్బీఐ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్తనిబంధనలు అమలు చేయనున్నట్లు చెప్పింది.

Tags: GST collections stood at ₹2 lakh crore in July.