అమరావతిముచ్చట్లు:
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) దేశవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్నది. సర్ తొలి దఫాలో బీహార్, రెండో దఫాలో భాగంగా 12 రాష్ర్టాలు, యూటీల్లో సర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది.
మూడో దఫాలో భాగంగా 10 రాష్ర్టాలు, యూటీల్లో సర్ ప్రక్రియను నిర్వహించారు. ఇందులో 1.13 కోట్ల మంది (10.39 శాతం) ఓటర్లను తొలగించినట్టు ఈసీ వర్గాలు తెలిపాయి.
ఏపీలో అత్యధికంగా 44.89 లక్షల ఓట్లను ఏరివేసినట్టు వెల్లడించాయి. ముసాయిదా జాబితాను ఈసీ విడుదల చేసింది. ఇప్పటివరకూ మూడు దఫాల్లో నిర్వహించిన ‘సర్’లో మొత్తంగా 8.98 కోట్ల ఓటర్లను తొలగించారు.
Tags: In the third phase of the ‘SUR’ (Special Summary Revision) exercise, 1.13 crore voters were removed; Andhra Pradesh recorded the highest number at 45 lakhs.