మదనపల్లి ముచ్చట్లు:
మదనపల్లెలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఫిర్యాదులు స్వీకరించారు.
మొత్తం వచ్చిన 62 ఫిర్యాదులలో భూ వివాదాలు 19, ఆర్థిక లావాదేవీలు 7, కుటుంబ కలహాలు 12, చీటింగ్ 4, న్యూసెన్స్ 3, మరియు ఇతర సమస్యలు 17 ఉన్నాయి.
భూకబ్జాలు, వడ్డీ వేధింపులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
బాధితులకు సత్వర న్యాయం అందించాలని, సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.
ఈ ఫిర్యాదులపై విచారణను వేగంగా పూర్తిచేసి, సంబంధిత నివేదికలను వెంటనే జిల్లా ప్రధాన కార్యాలయానికి పంపాలని ఎస్పీ స్పష్టం చేశారు.
Tags: District SP Dheeraj Kunubilli at the ‘Public Grievance Redressal Forum’