-యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్‌రెడ్డి
పుంగనూరుముచ్చట్లు:
తెలుగుదేశం ప్రభుత్వం డిఎస్సీ నియామకాల్లో అక్రమాలకు పాల్పడిందని, వాటిపై నిగ్గుతేల్చేదాక వైఎస్సార్‌సిపి పోరాటం చేస్తుందని రాష్ట్ర యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం పార్టీ పిలుపు మేరకు టౌన్‌హాల్ సమావేశాన్ని ఎంపిపిలు భాస్కర్‌రెడ్డి,ఈశ్వరయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, సీమ జిల్లాల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్ ల ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు, పార్టీ నాయకులతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా హేమంత్‌రెడ్డి మాట్లాడుతూ డిఎస్సీలో అక్రమాలకు పాల్పడిన మంత్రి నారాలోకేష్ రాజీనామ చేయాలన్నారు. అలాగే అక్రమాలపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రూ.9.100 కోట్లు బకాయిలు ఉండగా కేవలం రూ.2.900 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. వసతిదీవెన బకాయిలు రూ.3.300 కోట్లు ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి మేరకు నిరుద్యోగులకు ప్రతి నెల రూ.3000 చొప్పున పంపిణీ చేసి , బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వం తప్పుడు గణాంకాలతో ప్రజలను మోసగిస్తోందని ఆరోపించారు. రెండేళ్ల తెలుగుదేశం పాలనలో రాష్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని మండిపడ్డారు. ఇంటింటా తెలుగుదేశం రెండేళ్ల పాలనపై కరపత్రాలను ఇంట్లో తలుపులకు పెట్టి వెళ్తున్నారని, నిలబడి చెప్పే దమ్ము లేదని ఎద్దెవ చేశారు. సూపర్-6 పేరుతో ప్రభుత్వం ఒక్క పథకాన్ని కూడ ప్రజలకు అందించలేదని ఆరోపించారు. వైఎస్సార్‌సిపి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి , సంక్షేమ పథకాలను తమ ఖాతాల్లో వేసుకునేందుకు క్రెడిట్‌చోరీ చేస్తోందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ కన్వీనర్ ఇర్ఫాన్, మిధున్‌యువసేన అధ్యక్షుడు జయకృష్ణ, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కళ్యాణ్‌భరత్, యువజన విభాగం స్థానిక అధ్యక్షులు సిద్ధిక్, హేమంత్, ఇర్ఫాన్, శివారెడ్డి, నవీన్‌నాయుడు, షౌఖత్, ప్రశాంత్‌రెడ్డి, కుమార్, సుమంత్, యశ్వంత్, చౌడేపల్లె నాయకులు అంజిబాబు, నాగభూషణ్‌రెడ్డి, సుధాకర్, బిసి సెల్ నాయకులు రమణ, సిఎల్‌పి.రెడ్డి , మైనార్టీ నాయకులు మమ్ము, అస్లాంమురాధి, నయాజ్, అజీజ్, ఆసిఫ్, రేష్మ తదితరులు పాల్గొన్నారు.

Tags: An uncompromising struggle until the DSC irregularities are exposed.