డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలి
- విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించాలి
- నిరుద్యోగ భృతి ఇవ్వాలి
- మాజీ ఎంపి రెడ్డెప్ప
పుంగనూరుముచ్చట్లు:
డిఎస్సీ నియామకాల్లో పలు అక్రమాలు జరిగినందున నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ రాజీనామ చేయాలని , లేదా ప్రభుత్వం ఆయనను బర్తరఫ్ చేయాలని , దీనిపై సీబిఐ విచారణ చేపట్టాలని మాజీ ఎంపి రెడ్డెప్ప డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో వైఎస్సార్‌సిపి టౌన్‌హాల్ సమావేశాన్ని విద్యార్థి విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో రెడ్డెప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రతి నెల రూ.3 వేలు ఇస్తామన్న జీవనభృతి రెండేళ్లు గడిచిన ఇవ్వలేదన్నారు. దీనిని వెంటనే చెల్లించాలన్నారు. అలాగే జోన్-1లో నవీన్ అనే వ్యక్తికి ప్రశ్నపత్రాల తయారీలో హస్తం ఉందని ఆరోపించారు. అతడికి వెహోదటి ర్యాంకు వచ్చిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని , వాస్తవాలను మరుగున పెడుతున్నారని ఆరోపించారు. లోకేష్ విద్యాశాఖ పరువు , ప్రతిష్టలను మంటగలిపారని ఆరోపించారు. ఉధ్యమాన్ని ఉధృతం చేసి లోకేష్ రాజీనామ చేసేదాక పోరాటం కొనసాగిస్తామని , నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చలగాటం ఆడుతోందని మండిపడ్డారు. వైఎస్సార్‌సిపి కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు ఈనెల 6, 7, 8 తేదీలలో రిలేదీక్షలు చేపడుతామన్నారు. 10వ తేదీన నియోజకవర్గ స్థాయిలో విద్యార్థులను, నిరుద్యోగులను భాగస్వాములను చేసి ,ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలలో మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈసమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, ఎంపిపి భాస్కర్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, రొంపిచెర్ల నాయకుడు రెడ్డిశ్వర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, సీమజిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము తదితరులు పాల్గొన్నారు.


Tags: Education Minister Lokesh must resign.