March 25, 2026
Explore
తిరుపతిలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ పోలీసుల కఠిన చర్యలు.

తిరుపతిలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ పోలీసుల కఠిన చర్యలు.

March 25, 2026 | Andhra Pradesh

  • తిరుపతి ముచ్చట్లు:

  • ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై కేసులు నమోదు,ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు.
  • తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు, తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ పర్యవేక్షణలో ఈ రోజు తిరుపతి పట్టణంలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది.
  • డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.
  • వాహన తనిఖీలలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, మొత్తం 9 కేసులు నమోదు చేసి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు ఒక్కరిపై కేసు నమోదు చేయడం జరిగింది.
  • కోర్టు శిక్షలు.
  • గౌరవ 1వ స్పెషల్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ కోర్టు, తిరుపతి ధనలక్ష్మి , డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నిందితులైన 9 మందికి శిక్ష విధించగా, ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.90,000 జరిమానా విధించబడింది.
  • అలాగే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన ఒక వ్యక్తికి రూ.500 జరిమానా విధించారు.
  • ప్రజలకు సూచనలు.
  • మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు అధికంగా ఉంటాయని, అందువల్ల వాహనదారులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని తిరుపతి ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
  • ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని పోలీసులు సూచించారు.

Tags:Traffic Police Take Strict Measures to Curb Road Accidents in Tirupati.