August 3, 2026
Explore
చిత్తూరు, కడప జిల్లాల్లో డీసీసీబీ బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్

చిత్తూరు, కడప జిల్లాల్లో డీసీసీబీ బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్

August 3, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (DCCB)లో 75 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోపు chittoordccb.bank.in లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఐబీపీఎస్ నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుందని, ఇంటర్వ్యూలు ఉండవని పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా 67 పోస్టులను ఓపెన్ కేటగిరీలో, 8 పోస్టులను PACS ఉద్యోగులతో భర్తీ చేయనున్నారు. అలాగే కడప జిల్లా డీసీసీబీలోనూ 40 ఖాళీ పోస్టులు ఉన్నట్లు వెల్లడించారు.

Tags: Notification for DCCB bank jobs in Chittoor and Kadapa districts