పీలేరు ముచ్చట్లు:
పీలేరు మండలం తలపుల గ్రామంలోని ఉలవల గంగమ్మ ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. దుండగులు ఆలయ తాళాలు పగులగొట్టి అమ్మవారికి అలంకరించిన బంగారు ఆభరణాలు, హుండీలోని నగదును అపహరించినట్లు సమాచారం. సోమవారం ఉదయం ఘటనను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags: Theft at a temple in Pileru mandal