పుంగనూరుముచ్చట్లు:
ప్రజలకు , సమాజానికి వివిధ రకాల సేవలు అందించినందుకు రోటరీక్లబ్‌కు 7అవార్డులను క్లబ్ గవర్నర్ అందజేశారు. ఆదివారం బెంగళూరులో ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3191 సమావేశం నిర్వహించారు. సమావేశంలో క్లబ్‌గవర్నర్ బిఆర్.శ్రీధర్, రోటరీ కప్ , అవార్డులను, ప్రశంసాపత్రాలను పంపిణీ చేశారు. అవార్డులు అందుకున్న వారిలో గౌరవ సభ్యులు డాక్టర్లు ప్రభాకర్, విజయకుమారి, అధ్యక్షుడు నానబాలగణేష్, కార్యదర్శి సిఎస్.రాజారెడ్డి, కాబోయే ప్రెసిడెంట్ శివశంకర్ , అనిల్‌కుమార్, పురుషోత్తం, భాస్కర్‌జెట్టిలు అవార్డులు అందుకున్నారు. అవార్డు గ్రహితలను గవర్నర్ అభినందించి , రాబోవు రోజుల్లో మరిన్ని సేవలు అందించి అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. స్థానిక సభ్యులు, పట్టణ ప్రముఖులు రోటరీక్లబ్ వారిని అభినందించారు.
Tags: Awards for Rotary Club