పుంగనూరుముచ్చట్లు:
నియోజకవర్గ వైఎస్సార్‌సిపి సమావేశాన్ని స్థానిక జెఎండి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా ఆదివారం తెలిపారు. మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఫీజు రియంబర్స్మెంటు, నిరుద్యోగభృతి పై నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని పార్టీ ప్రతినిదులు, యువజన, విద్యార్థి అనుబంధ విభాగాల నేతలు , ప్రజాప్రతినిదులు, మాజీ ప్రజాప్రతినిదులు , పెద్దిరెడ్డి అభిమానులు తప్పక హాజరై జయప్రదం చేయాలని కోరారు.
Tags: YSRCP meeting on the 3rd