August 2, 2026
Explore
ఆర్యవైశ్యులచే శ్రీరామ సప్తాహ పూజలు

ఆర్యవైశ్యులచే శ్రీరామ సప్తాహ పూజలు

August 2, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ సభ్యులచే ఆదివారం శ్రీరామ సప్తాహ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో సంఘ కుటుంబ సభ్యులు ఉదయం భక్తిశ్రద్దలతో శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ పుష్కరిణి నుంచి గంగాజాలలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. గంగాజలాలతో శ్రీ సీతారాముల విగ్రహాలను అభిషేకించి , ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామ సంకీర్తనలతో ఆప్రాంతం భక్తితో పారవశ్యవైంది. గత 48 సంవత్సరాలుగా శ్రీరామ సప్తాహాన్ని ఆర్యవైశ్య సంఘం క్రమం తప్పకుండ నిర్వహిస్తుండటం గమనార్హం.

Tags: Sri Rama Saptaha Pujas performed by Arya Vysyas