-తిరుపతిలోని సీఏ అకాడమి రూ.10 లక్షలు విరాళం
- ఇప్పటికి రూ.24 లక్షల విరాళాలు
పుంగనూరుముచ్చట్లు:
సీఏ చదువుతున్న రమ్యశ్రీకి ఊపిరితిత్తుల మార్పిడికి రూ.50 లక్షలు అవసరం కాగా తిరుపతి బాలాజి కాలనీలో ఉన్న ఇన్‌స్ట్యూట్‌ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియ కళాశాల చైర్మన్ సీఏ.మన్నెంసింహాద్రి ఆధ్వర్యంలో బాధిత కుటుంభాన్ని కలిశారు. వారి తరపున రూ.10 లక్షలు విరాళాన్ని రమ్యశ్రీ తల్లిదండ్రులు వెంకట్రమణ, లక్ష్మీ దంపతుల అందజేశారు. అలాగే పెద్దపంజాణి మండలం డీలర్లు రూ.25 వేలు ఆర్థికసాయం అందించారు. ఇప్పటి వరకు రూ.24 లక్షలు విరాళాలు లభించింది. కాగా సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన రమ్యశ్రీ సీఏ చదువుతోంది. ఇలా ఉండగా ఆమె ఊపిరితిత్తులవ్యాధికి గురైంది. చికిత్సకు తగిన ఆర్థిక స్థోమత లేకపోవడంతో తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని దాతలను తల్లిదండ్రులు అర్థించారు. ఈ విషయాన్ని సాక్షి పత్రిక గమనించి గత నెల 18న పేద…ఆపై పెద్దబాధ అనే శీర్షికన ప్రత్యేక కథనంతో వెలుగులోనికి తీసుకురావడం జరిగింది. దీనిపై దాతలు స్పందించారు. శక్తి మేరకు విరాళాలు అందించే కార్యక్రమం చేపట్టి, రమ్యశ్రీ చికిత్సకు అండగా నిలిచారు. రమ్యశ్రీ స్నేహితులు రాజారెడ్డి, ఆవుల హరిప్రసాద్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రమ్యశ్రీ తల్లిదండ్రులు తమకు అండగా నిలిచిన సాక్షి పత్రికకు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
Tags: Donations pour in for Ramyasree’s treatment.