రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి టౌన్ మాసాపేటలోని పాత కలెక్టరేట్ వెనుక ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభించనున్న మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల బాలుర గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పద్మరాణి తెలిపారు. వార్షిక కుటుంబ ఆదాయం రూ.1 లక్షలోపు ఉండి 5వ నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 79811 43657ను సంప్రదించాలని సూచించారు.
Tags: Applications Invited for Admissions to Residential Schools