September 15, 2026
Explore
UPI పై కీలక నిర్ణయం

UPI పై కీలక నిర్ణయం

September 15, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) UPI చెల్లింపులు పూర్తిగా ఉచితం

లావాదేవీ విలువ ఎంత ఉన్నా P2P ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీ ఉండదు

₹2,000 దాటిన P2M (వ్యక్తి నుంచి వ్యాపారికి) చెల్లింపులపై 0.4% MDR

₹75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు MDR గరిష్ఠంగా ₹300 మాత్రమే

₹2,000 లోపు P2M లావాదేవీలపై MDR సున్నా

రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం, వ్యవసాయ ఇన్‌పుట్స్ వంటి కీలక రంగాలకు ₹5 ఫ్లాట్ MDR

మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్, స్టాక్ బ్రోకర్లు, డీలర్లకు 0.02% MDR, గరిష్ఠంగా ₹300

నెలకు UPI QR ద్వారా ₹1 లక్ష వరకు స్వీకరించే చిన్న వ్యాపారులకు P2PM కింద జీరో MDR కొనసాగింపు

UPI యాప్‌లు ప్లాట్‌ఫామ్ ఫీజులు లేదా దాచిన ఛార్జీలు విధించకూడదు

వినియోగదారులపై MDR భారాన్ని మోపకుండా చూడాలని బ్యాంకులకు సూచనలు

వ్యక్తిగత వినియోగదారులకు నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి లేదు

రోజువారీ ₹1–5 లక్షల ట్రాన్సాక్షన్ పరిమితులు భద్రత కోసం మాత్రమే, ఛార్జీల కోసం కావు

MDR ప్రభావం పడేది మొత్తం వ్యాపారి లావాదేవీల్లో సుమారు 4% మాత్రమే

MDR ద్వారా వచ్చే మొత్తంలో 5% చిన్న వ్యాపారుల్లో UPI వినియోగాన్ని ప్రోత్సహించే ప్రత్యేక నిధికి

కేంద్రం సెప్టెంబర్ 14న నోటిఫికేషన్ జారీ చేయగా, NPCI సెప్టెంబర్ 15న వివరణాత్మక సర్క్యులర్ జారీ చేసింది

Tags: Key decision on UPI