August 1, 2026
Explore
పేద….ఆపై పెద్దబాధకు గురైన రమ్యశ్రీకి అండగా నిలిచిన దాతలు

పేద….ఆపై పెద్దబాధకు గురైన రమ్యశ్రీకి అండగా నిలిచిన దాతలు

August 1, 2026 | Andhra Pradesh

రూ.13.75 లక్షలు విరాళాలు

పుంగనూరుముచ్చట్లు:

సీఏ చదువుతున్న రమ్యశ్రీకి ఊపిరితిత్తుల మార్పిడికి రూ.50 లక్షలు అవసరమని చెన్నై డాక్టర్లు సూచించారు. సాధారణ రైతు కుటుంభానికి చెందిన వెంకట్రమణ, లక్ష్మీ దంపతులకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని దాతలను అర్థించారు. ఈ విషయాన్ని తెలుగుముచ్చట్లువెబ్‌సైట్‌నందుగత నెల 18న పేద…ఆపై పెద్దబాధ అనే శీర్షికన ప్రత్యేక కథనం వెలువడింది. దీనిపై దాతలు స్పందించారు. కరసనపల్లెకి చెందిన రెడ్డివారి నాగశంకర్‌రెడ్డి రూ.70 వేలు అందించారు. అలాగే విశ్రాంత టీచర్‌ వెంకటరెడ్డి రూ.1.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. రెడ్డివారి శైలజారెడ్డి రూ.75 వేలు విరాళం ఇచ్చారు. పుంగనూరు పట్టణంలోని చెంగాలాపురంకు చెందిన పవన్‌కుమార్‌ రూ.60 వేలు విలువ చేసే ఆక్సిజన్‌ మిషన్‌ను విరాళంగా ఇచ్చారు. మానవత సంస్థ రూ.37 వేలు, రోటరీక్లబ్‌ రూ.44 వేలు విరాళంగా ఇచ్చారు. వీరితో పాటు ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక కు చెందిన పలువురు దాతలు తమ శక్తి మేరకు రూ.1000, 2000 చొప్పున బాధిత కుటుంభానికి ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా ఆర్థిక సహాయం అందించారు. సుమారు ఇప్పటి వరకు రూ.13.75 లక్షల రూపాయలు విరాళాలు అందిందని ఆకుటుంబ స్నేహితులు రాజారెడ్డి , ఆవులహరిప్రసాద్‌ లు తెలిపారు. తెలుగుముచ్చట్లువెబ్‌సైట్‌ కు, దాతలకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags: Donors rally to support Ramya Sri, who is poor and facing immense suffering.