రాజంపేట ముచ్చట్లు:
ఏపీ స్టేట్ పాలఏకిరి బీసీ కార్పొరేషన్ చైర్మన్ కందూరి నాగేశ్వర్ నాయుడు శనివారం గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, బీసీ సంక్షేమం తదితర అంశాలపై పరస్పరం చర్చించినట్లు సమాచారం. గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన నాగేశ్వర్ నాయుడు జ్ఞాపికను అందజేశారు. ఈ భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ నాయుడు పాల్గొన్నారు.
Tags: Chairman met Goa Governor Ashok Gajapathi Raju.