– పరామర్శించిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
దాడిలో గాయపడిన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు–తిరుపతి జిల్లాల అధ్యక్షులు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి రుయా ఆసుపత్రిలో పరామర్శించారు.మఠం భూములను అక్రమంగా కబ్జా చేస్తున్న కబ్జాదారులను అడ్డుకున్నందుకు, అవిలాల మాజీ సర్పంచ్ వెంకటరమణపై భూ కబ్జాదారులు దారుణానికి ఒడిగట్టారు.చంద్రగిరి నియోజకవర్గంలోని అవిలాల గ్రామంలో మాజీ సర్పంచ్, దళిత నాయకుడు వెంకటరమణపై జరిగిన దాడిలో గాయపడిన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు–తిరుపతి జిల్లాల అధ్యక్షులు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి రుయా ఆసుపత్రిలో పరామర్శించారు.ఈ సందర్భంగా బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరారు.అదేవిధంగా, మహిళ అనే కనీస గౌరవం కూడా లేకుండా విజయనిర్మలపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భూమన కరుణాకర రెడ్డి భరోసా ఇచ్చారు.


Tags:Mass attack on former Sarpanch!