August 1, 2026
Explore
బిడ్డకు తల్లిపాలు అవసరం

బిడ్డకు తల్లిపాలు అవసరం

August 1, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

జన్మించిన పిల్లలందరికి తల్లిపాలు పట్టించాలని, దీని ద్వారా పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుందని ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ అయేషా నస్రీన్‌తాజ్‌ తెలిపారు. శనివారం పట్టణంలోని యూబికాంపౌండులో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భవతులకు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని గర్భవతులు, బాలింతలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అంగన్‌వాడీ కార్యకర్తలు సల్మా, అయేషా పాల్గొన్నారు.

Tags:A baby needs breast milk.