అమరావతిముచ్చట్లు:
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పార్టీ నాయకత్వానికి తెలిపినట్లు సమాచారం. రాజీనామా నేపథ్యంలో ఆయన తన X (ట్విట్టర్) బయోలో ప్రధాని నరేంద్ర మోదీకి తాను “జీవితకాల అనుచరుడు”గా అభివర్ణించుకున్నారు.
2017లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన పూనావాలా, పార్టీ తరఫున అనేక మీడియా చర్చల్లో పాల్గొని బీజేపీ విధానాలను సమర్థించారు. కాగా, తాజా నిర్ణయంతో ఆయన రాజకీయాలకు దూరమవుతారా అనే చర్చ మొదలైంది.
Tags; BJP National Spokesperson Shehzad Poonawalla resigns.