ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:
AP: ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం 2023 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో మూడేళ్ల కాలానికి ఈ పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. క్లాజ్-1 ప్రకారం పదవిరీత్యా సభ్యులుగా కొనసాగేవారు కొనసాగుతారు. అయితే, క్లాజ్-2 కింద ప్రభుత్వం నామినేట్ చేసిన సభ్యులను తొలగించింది. కొన్ని విశ్వవిద్యాలయాలకు మాత్రం కొత్తగా పాలక మండళ్లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
tags: AP government dissolves executive councils of 18 universities.