అమరావతిముచ్చట్లు:
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయే రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)లో నమోదు, ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించింది. సర్వర్ సమస్యల కారణంగా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. రుణగ్రహీతలతో పాటు రుణాలు తీసుకోని రైతులు కూడా ఈ పథకంలో చేరవచ్చు. రాష్ట్రంలో వరి, పత్తి, మిరపతో పాటు ఉల్లి, పసుపు, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలకు బీమా వర్తిస్తుంది. రైతులు సమీప గ్రామ సచివాలయం, మీ సేవ లేదా సీఎస్‌సీ కేంద్రాల్లో ఆగస్టు 15లోగా నమోదు పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది.
Tags: PM Fasal Bima Yojana registration deadline extended—until when?