అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
ప్రపంచ స్కౌట్ స్కార్ఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి స్కౌట్ స్కార్ఫ్‌ను ధరింపజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్కౌట్ స్కార్ఫ్ సాహసం, ఐక్యత, సేవాభావం, క్రమశిక్షణకు ప్రతీక అని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు, సమాజ సేవ పట్ల అంకితభావం పెంపొందించడంలో స్కౌట్ శిక్షణ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. జిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమానికి పోలీసు శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్కౌట్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు.
అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డా. కె. సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డా. అనురాధలను కూడా స్కౌట్ ప్రతినిధులు కలిసి స్కార్ఫ్‌ను ధరింపజేసి ప్రపంచ స్కౌట్ స్కార్ఫ్ దినోత్సవ విశిష్టతను వివరించారు.
Tags; Scouting fosters a spirit of service and leadership among students: SP