పుంగనూరుముచ్చట్లు:
నిబంధనలకు విరుద్ధంగా మైనర్లకు వాహనాలు ఇచ్చి నడిపించే తల్లిదండ్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. శుక్రవారం ఎస్‌ఐలు అన్సర్‌బాషా, కెవి.రమణ తో కలసి విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ 18 ఏళ్ల లోపు గల మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతివేగంగా నడపడం, సెల్‌ఫోన్లు , బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడుతూ వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. అలాగే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనాల నెంబరు ప్లేట్లపై ఇష్టానుసారంగా నెంబర్లు, పేర్లు, రాసి వాహనాలను వినియోగిస్తే సీజ్ చేస్తామన్నారు. రహదారి భద్రత, మోటారు వాహనాల నిబంధనలను ప్రతి ఒక్కరు అమలు చేయాలన్నారు. వీటిపై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.
Tags: Parents can be sued if minors drive vehicles