March 25, 2026
Explore
గరుడ వారిది పై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

గరుడ వారిది పై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

March 25, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

గరుడ వారధి పై భారీ వాహనాలకు అనుమతి లేదు

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఆంక్షలు కఠినతరం చేయాలి

జిల్లా రహదారుల భద్రతా కమిటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కోసం అన్ని విద్యాసంస్థల్లో ఈగల్ క్లబ్బులు ఏర్పాటు చేయాలి

గంజాయి మరియు మత్తుపదార్థాల వాడకం వలన కలిగే అనర్థాల పై పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

వాహనాదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

జిల్లాలో ప్రధానంగా బ్లాక్ స్పాట్లు, ప్రమాద అవకాశం గల 83 ప్రాంతాల వద్ద ప్రమాద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి : ఎస్పీ సుబ్బరాయుడు

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ దిశగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు.బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, అడిషనల్ ఎస్పీ రవి మనోహరచారి, తిరుపతి, చెన్నై, నెల్లూరు నేషనల్ హైవే పిడి లు వెంకటేశ్వర్లు, రవీంద్ర రావు, చౌదరి, జిల్లా రవాణాశాఖ అధికారి మురళీమోహన్, ఆర్ అండ్ బి ఎస్ఇ రాజా నాయక్ తో కలిసి జిల్లాస్థాయి రోడ్ సేఫ్టీ కమిటీ సమీక్షా సమావేశo నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు రహదారి నిబంధనలను పాటించేలా అవగాహన కల్పించడం వలన జిల్లాలో ప్రమాదాలలో మరణాల సంఖ్యను తగ్గించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే రహదారుల బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. బ్లాక్ స్పాట్స్ నందు ఇంజనీరింగ్ పనులు పూర్తి అయ్యేలా చూడాలని తెలిపారు. ప్రతి రహదారుల నియమాలు పాటించేలా అవగాహన పెంచి రోడ్డు ప్రమాద నివారణ దిశగా కృషి చేయాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించే ప్రయాణకులకు రహదారుల ప్రాంతాలలో రెస్ట్ రూములు ఉండేలా చూడాలన్నారు. పెంచాలన్నారు. జాతీయ రహదారుల ప్రదేశాలలో ఎటువంటి మద్యం అమ్మకాలు ఉండకూడదని తెలిపారు. రహదారుల ప్రాంతాలలో ప్రయాణికుల సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రమాద సూచిక బోర్డుల తో పాటు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. హెల్మెట్ ధరించిన ప్రయాణకులకు మాత్రమే గరుడ వారధి పైన ప్రయాణించే అవకాశం ఉంటుందని తెలిపారు. హెల్మెట్ ధరించని వారికి గరుడ వారధి పై వెళ్లడానికి అవకాశం లేదని తెలిపారు. గరుడ వారధి పై భారీ వాహనాల రాకపోకలకు అనుమతి లేదని అన్నారు. విద్యాలయాల్లోనూ సంక్షేమ వసతి గృహాల్లోనూ గంజాయి మత్తు పదార్థాలకు సంబంధించి తనిఖీలు ఎప్పటికప్పుడు చేపట్టాలని తెలిపారు. గంజాయి మరియు మత్తు పదార్థాల వాడకం వలన కలిగే అనర్థాల పై పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు వ్యతిరేక క్లబ్‌లు (EAGLE) ఏర్పాటు అవగాహన కల్పించాలన్నారు. వ్యతిరేక క్లబ్‌లు (EAGLE) ఏర్పాటుకు విద్యాశాఖ అధికారులు నిరంతరం చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారికి అత్యవసర చికిత్స నిమిత్తం ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

జిల్లా ఎస్పి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రధానంగా బ్లాక్ స్పాట్లు, ప్రమాద అవకాశం గల 83 ప్రాంతాలు గుర్తించడం జరిగిందని, బ్లాక్ స్పాట్ ల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడం కోసం నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల నివారణ దిశగా వాటి రవాణా తయారీ పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని తెలిపారు. అన్ని విద్యా సంస్థలలో ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు ఉండేలా చూడాలని పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే ఈగల్ క్లబ్బులు నిరంతరాయంగా ఉండేలా చూడాలని తెలిపారు. మెడికల్ స్టోర్ నందు మత్తు పదార్థాలను విక్రయించే వాటిపై కఠిన తరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని లైసెన్సులు కూడా లేకుండా చూడడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమైన జాతీయ రహదారుల ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాటి నివారణ దిశగా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించే విధంగా వాహనాదారులకు అవగాహన కార్యక్రమాలు కల్పించాలన్నారు. కూడళ్ళ వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సిగ్నల్ లను ఏర్పాటు చేయాలన్నారు. పిల్లలు మత్తుపదార్థాలకు బానిస కాకుండా చూసుకోవలసిన భాధ్యత తల్లిదండ్రుల పై ఉంటుందన్నారు.

సమావేశం అనంతరం గంజాయి నివారణ, డ్రగ్స్ వద్దు బ్రో, Nasha Mukt Bharat AbhiyaanDrug and alcohol addiction in India వంటి పోస్టర్లను జిల్లా ఎస్పీతో కలిసి ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్.ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పి లు, నేషనల్ హైవే అధికారులు, డిఎం అండ్ హెచ్ ఓ బాలకృష్ణ నాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags: Motorists traveling on Garuda Varadhi must wear a helmet.