అమరావతిముచ్చట్లు:
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావం ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం మరో 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్ మీదుగా మధ్యప్రదేశ్ వైపు కదిలే అవకాశం ఉందని వెల్లడించింది.
దీని ప్రభావంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Tags: Depression in the Bay of Bengal; chance of rain in AP.