March 25, 2026
Explore
శ్రీశైలం డ్యామ్ వద్ద ఘోరం.. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ను వెంటాడి చంపేశారు..! హంతకులు ఎవరంటే?

శ్రీశైలం డ్యామ్ వద్ద ఘోరం.. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ను వెంటాడి చంపేశారు..! హంతకులు ఎవరంటే?

March 25, 2026 | Andhra Pradesh

శ్రీశైలం ముచ్చట్లు:

శ్రీశైలం డ్యామ్ వద్ద జరిగిన ఈ ఘటన నిజంగా అత్యంత విషాదకరం. విధి నిర్వహణలో ఉన్న ఒక కానిస్టేబుల్ ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోవడం తోటి సిబ్బందిని, ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన ఊపిరితో ఉన్న కానిస్టేబుల్‌ వీరస్వామిని తోటి సిబ్బంది వెంటనే సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ దాడిలో మరో ఇద్దరు సిబ్బంది కూడా గాయపడ్డారు. ఈ ఘటనతో శ్రీశైలం డ్యామ్ పరిసరాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇంతకీ ఈ దారుణానికి ఒడిగట్టిన హంతకులు ఎవరు..? అసలేం జరిగిందంటే..

శ్రీశైలం డ్యామ్ రక్షణ విధుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ అనూహ్య రీతిలో మరణించడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. శత్రువుల నుంచి డ్యామ్‌ను కాపాడే నిఘా విభాగంలో పనిచేస్తున్న ఆయన, ప్రకృతిలోని చిన్న జీవులైన తేనెటీగల దాడికి బలైపోవడం అత్యంత దారుణం. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట పరిధిలోని డ్యామ్ వద్ద పిల్లి వీరస్వామి అనే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ విధుల్లో ఉన్నారు. జలాశయం లిఫ్ట్ ప్రాంతంలో ఆయన పహారా కాస్తున్న సమయంలో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ ఒక్కసారిగా తేనెటీగల గుంపు ఆయనపై దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఆయన శతవిధాలా ప్రయత్నించారు.

తేనెటీగలు కమ్ముకోవడంతో ప్రాణభయంతో పరుగులు తీసిన వీరస్వామి, ఆ ఆందోళనలో ఒక్కసారిగా కింద పడిపోయారు. వందలాది తేనెటీగలు ఆయనను కుట్టడంతో పాటు, ఆ తీవ్రమైన భయం కారణంగా ఆయనకు గుండెపోటు (Heart Attack) వచ్చినట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న తోటి సిబ్బంది వెంటనే స్పందించి ఆయనను సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరేలోపే వీరస్వామి ప్రాణాలు విడిచారు. మృతుడు వీరస్వామి స్వగ్రామం బాపట్ల జిల్లా చీరాల సమీపంలో ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విధి నిర్వహణలో ఉన్న తండ్రి ఇక లేరన్న వార్త విన్న ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే శ్రీశైలం బయలుదేరారు.

ఈ తేనెటీగల దాడిలో వీరస్వామితో పాటు ఉన్న మరో ఇద్దరు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. డ్యామ్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడం పట్ల తోటి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరస్వామి మృతి పట్ల ఎస్పీఎఫ్ ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags: Horrific Incident at Srisailam Dam: On-Duty Constable Hunted Down and Killed! Who Are the Killers?