పులివెందుల ముచ్చట్లు:
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన పెదనాన్న, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు ఆనంద్ రెడ్డి (75) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల వైసీపీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఆనంద్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైఎస్ జగన్ ఈ రోజు పులివెందులకు రానున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు.
Tags: Deep tragedy in YS Jagan’s family!!