అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (SIR) ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) విడుదల చేశారు.ఈ జాబితాకు సంబంధించి ముఖ్యమైనవివరాలను ఆయన వెల్లడించారు.
ఎన్యూమరేషన్ ప్రక్రియ.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ఫామ్‌లను మొత్తం 3.71 కోట్ల మంది సమర్పించినట్లు సీఈవో తెలిపారు.
మృతుల గుర్తింపు.
జాబితా పరిశీలనలో భాగంగా రాష్ట్రంలో 15.22 లక్షల మంది మృతి చెందినట్లు అధికారులుగుర్తించారు.
దృష్ట్యా డబుల్ ఎంట్రీలు..
రెండు వేర్వేరు చోట్ల ఓట్లు నమోదైనట్లు గుర్తించిన 7.37 లక్షల మంది వివరాలను సవరించనున్నారు.
అభ్యంతరాల స్వీకరణ..
ఈ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు లేదా సవరణలు కోరేందుకు ప్రజలకు ఆగస్టు 30 వరకు అవకాశం కల్పించారు.
తుది జాబితా విడుదల..
అన్ని అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు.
కొత్త ఓట్ల నమోదు.
అర్హులైన కొత్త ఓటర్లు ఎవరైనా ఉంటే ఫామ్-6 ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలని సీఈవో సూచించారు.
స్పష్టమైన హామీ..
ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, క్షేత్రస్థాయి విచారణ జరపకుండా ఏ ఒక్కరి ఓటును తొలగించబోమని సీఈవో స్పష్టం చేశారు.
రాజకీయ పార్టీలతో భేటీ..
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై చర్చించేందుకు వచ్చేనెల (సెప్టెంబర్) 4న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది.
Tags: Draft electoral roll for SIR released in AP.