అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా మహిళా పోలీస్ స్టేషన్‌లో ASI గా పనిచేస్తున్న ముచ్చలపూడి బాలకృష్ణుడు (60) అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. శుక్రవారం మదనపల్లెలో పోలీసు లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
1992లో పోలీసు శాఖలో చేరిన బాలకృష్ణుడు పలు పోలీస్ స్టేషన్లలో అంకితభావంతో సేవలందించారు. ఆయన మృతి పట్ల జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి, కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆర్‌ఐ (వెల్ఫేర్) రవికుమార్ మృతదేహానికి నివాళులర్పించి, మృతుని భార్య లక్ష్మీదేవికి పోలీసు శాఖ తరఫున రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేశారు.
బెంగళూరు రోడ్డులోని శ్మశానవాటికలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు గౌరవ వందనం సమర్పించగా, కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులు, సిబ్బంది అశ్రునయనాల మధ్య బాలకృష్ణుడికి తుది వీడ్కోలు పలికారు.
Tags: Final farewell to ASI Balakrishna with police honours.