. సంక్షేమ పథకాలను వివరించిన టీడీపీ నేతలు
సంబేపల్లి ముచ్చట్లు:
సంబేపల్లి మండలం గున్నికుంట్ల గ్రామంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ ‘డోర్ టు డోర్’ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మండల క్లస్టర్ ఇన్‌చార్జి గంగిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గున్నికుంట్ల గ్రామ అభివృద్ధికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.
Tags: Door-to-door campaigning in Gunnikuntla.