July 31, 2026
Explore
డెంగ్యూ నియంత్రణకు ప్రజల సహకారం అవసరం

డెంగ్యూ నియంత్రణకు ప్రజల సహకారం అవసరం

July 31, 2026 | Andhra Pradesh

జిల్లా మలేరియా అధికారి (DMO)

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి సబ్‌యూనిట్ పరిధిలోని దూళ్లవారిపల్లి గ్రామంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా మలేరియా అధికారి రామచంద్ర రెడ్డి, డెంగ్యూ నియంత్రణలో ఆరోగ్య సిబ్బంది సమిష్టి కృషిని అభినందించారు.

దోమలు పెరగకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్రతి శుక్రవారం “ఫ్రైడే డ్రై డే” పాటించడం, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు డెంగ్యూ లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించి ఆరోగ్య సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

Tags: Public cooperation is essential for dengue control.